Connect with us

Festivals

TAGKC @ Kansas City: తెలుగు సంస్కృతిని ప్రతిబింభిస్తూ ఉగాది వేడుకలు @ Olathe Northwest High School

Published

on

Olathe, Kansas: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC – Telugu Association of Greater Kansas City) ఆధ్వర్యం లో నిర్వహించిన ఉగాది (Ugadi) వేడుకలు స్థానిక ఓలేత నార్త్ వెస్ట్ హై స్కూల్ (Olathe Northwest High School) లో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సుమారు 750 మంది హాజరయ్యారు.

ప్రోగ్రాం కమిటీ చైర్ శ్రీమతి యామిని వల్లేరు (Yamini Valleru) ఆహ్వానితులకి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిందూ టెంపుల్ ఆఫ్ కాన్సాస్ సిటీ (Hindu Temple of Kansas City) పూజారి శ్రీ శ్రీనివాసాచార్యులు గారి  పంచాంగ శ్రవణం, వారి అర్థవంతమైన వివరణ మరియు ఆశీర్వచనాలు, వేడుకకు ఆధ్యాత్మిక మాధుర్యం జోడించాయి.

బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్ శ్రీ శ్రీని పెనుగొండ (Srini Penugonda) తమ నూతన బోర్డు సభ్యులని అందరికి పరిచయం చేసారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీమతి శ్రావణి మేక (Sravani Meka) నూతన కార్యవర్గ సభ్యులని పరిచయం చేస్తూ వారు కాన్సాస్ (Kansas) లో ని తెలుగు వారికి చేస్తున్న సేవని కొనియాడారు.

ఇతర సంస్థల మహిళా నాయకులైన ఉషా సాహ, అభిరుచి సింగ్ మరియు కళై పద్మనాభన్ ను బోర్డు సభ్యులు సరితా ఎడ్మ, దీప్తి వొడ్నాల, శ్రావణి మేక సన్మానించారు. ఆర్ట్స్, చెస్, పికిల్ బాల్ పోటీల్లో విజేతలకు, రాఫెల్ విన్నర్లకు బహుమతులు స్పోర్ట్స్ చైర్ శ్రీ సురేష్ తుమ్మల, బోర్డు సభ్యులు అభిరాం దువ్వూరి  అందచేశారు.

కళాత్మక ప్రదర్శనలతో వేదిక నిండిపోయింది. కూచిపూడి మరియు భారతనాట్యం వంటి నృత్యరూపాలతో పాటు సినిమా పాటల డాన్సులతో పిల్లలు, పెద్దలు అందరిని అలరించారు. వారి నైపుణ్యం, సంస్కృతిని ప్రతిబింబించడంలో వారు చూపిన కృషి మాకు ఎంతో గర్వకారణంగా నిలిచాయి.

ఈ కార్యక్రమాన్ని ఆంకర్ శ్రీమతి దీప్తి యాయవరం (Deepti Yayavaram) ఎంతో సజావుగా నడిపించారు. చివరిగా కమిటీ వైస్ ప్రెసిడెంట్ మధు గంట (Madhu Ganta)  కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన దాతలకు, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలుపుతూ భారత జాతీయ గీతం తో ముగించారు.

కార్యక్రమం ముగిసిన తర్వాత అందరికి ఫుడ్ కమిటీ చైర్ శ్రీ ఉమాకాంత్ పార్శి (Umakanth Parsi) గారి ఆధ్వర్యం లో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC – Telugu Association of Greater Kansas City) వారు కమ్మని విందుని అందించారు.

error: NRI2NRI.COM copyright content is protected