Mesha Rasi Phalalu
Vrushabha Rasi Phalalu
Midhunam Rasi Phalalu
Karkatakam Rasi Phalalu
Simha Rasi Phalalu
Kanya Rasi Phalalu
Tula Rasi Phalalu
Vruschika Rasi Phalalu
Dhanu Rasi Phalalu
Makara Rasi Phalalu
Kumbha Rasi Phalalu
Meena Rasi Phalalu
2025లో ఈ మూడు రాశులపై ఏలినాటి శని ప్రభావం.. కొంత మంచి, కొంత చెడు!
జ్యోతిషశాస్త్రంలో శని దేవుడు నైతికత, న్యాయ దేవుడుగా చెబుతారు. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల వారి జీవితంలో శని ప్రభావం ఉంటుంది. 2025-26 లో ఏ రాశులవారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో చూద్దాం..
శని సంచారంతో కొన్ని రాశులకు శని ఏడున్నర నుండి ప్రారంభమవుతుంది. శని దేవుడు ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. 2025 సంవత్సరంలో శని దేవుడు రాశిని మారుస్తాడు. అంటే 2025లో శని సంచారం జరుగుతుంది. ఈ సంచార సమయంలో శనిగ్రహం కుంభరాశి నుండి మీనరాశికి వెళుతుంది. శనీశ్వరుడు మీనరాశిలోకి సంచరించే సమయంలో దాని ప్రభావం అన్ని రాశులలో కనిపిస్తుంది. కొంతమందికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. 2025లో ఏయే రాశుల వారికి శని సంచారం మొదలవుతుందో చూద్దాం.
2025లో శని సంచారం మేషరాశికి ఏడున్నర శని మొదటి దశ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఏడున్నర శని మొదటి దశ కాబట్టి, మీరు ఆకస్మికంగా ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి పురోగతిని చూడవచ్చు. ఆకస్మికంగా బాధ్యతలు పెరుగుతాయి. ఏడున్నర శని ప్రారంభంతో శని ప్రభావం అంతగా ఉండదు. అయితే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి ఈ సమయంలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి.
2025లో శని సంచారం మీన రాశికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం అవుతుంది. అంటే శని దేవుడు ఈ దశలో ఈ రాశుల వారి వృత్తి, ఆర్థిక, సంబంధాలలో పెనుమార్పులు తీసుకురాబోతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ రాశులవారి సహనానికి పరీక్ష ఉంటుంది. చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన సమయం అవుతుంది. ఈ కాలంలో ఆధ్యాత్మికతపై ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల ప్రభావం తగ్గుతుంది.
2025లో శని సంచారం కుంభరాశి వారికి ఏడున్నర శని చివరి దశ ప్రారంభం అవుతుంది. జీవితంలో ఇప్పటివరకు ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదుర్కొన్న మీరు 2025లో మంచి, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ప్రధానంగా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారంలో మంచి పురోగతిని చూస్తారు. ఆర్థిక స్థితిలో మంచి పెరుగుదల కనిపిస్తుంది. అయితే ఆరోగ్యం, సంబంధాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు, సింహ రాశుల పరిస్థితి ఏంటంటే
మీన రాశిలో శని సంచారం వల్ల అర్థాష్టమ శని ధనుస్సు రాశి వారి పైన , సింహ రాశుల మీద అష్టమ శని ప్రభావం ఉంటుంది. ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. ఈ కాలంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. 2027 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఆపరేషన్ జరిగే అవకాశం కలదు. వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్తగా వుండటం మంచిది.
గమనిక: పైన వివరించిన ఫలితములు కొంతమందికి జరగవచ్చు కొంతమందికి జరగకపోవచ్చు. శని ప్రభావం మీరు చేసే కర్మలను బట్టి మారుతుంది. అందుకనే ధర్మ బద్ధ మైన జీవనం, దైవారాధన, దాన ధర్మాలు చేయటం వంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇవే గాక మీ జన్మ జాతకం లో శని యొక్క స్థితిని బట్టి మరియు శుభగ్రహ వీక్షణ వల్ల శని దేవుని ప్రభావం మీ పై తగ్గ గలదు. అలానే పాప గ్రహ వీక్షణ వలన పెరగ గలదు అని గమనించండి.
పంచాంగ కర్త: డా. భువనగిరి మురళీ కృష్ణ శర్మ సిద్ధాంతి . నార్త్ కరోలినా.