Connect with us

Sports

45 ఏళ్ళ తానా క్రీడల గతిని మార్చిన ది అన్ స్టాపబుల్ నెక్స్ట్ జనరేషన్ శశాంక్ యార్లగడ్డ

Published

on

. తానా క్రీడలను కొత్త పుంతలు తొక్కించిన శశాంక్ యార్లగడ్డ
. #TANANexGen నినాదానికి విస్తృత ప్రచారం
. నూతన ఒరవడితో సరికొత్త క్రీడలకు అంకురార్పణ
. తానాలో పాత కొత్త తరాల సమన్వయం
. క్రీడాస్ఫూర్తిని ఇనుమడింపజేస్తున్న తానా యువతేజం
. 16 నెలల్లో 30 కి పైగా క్రీడా కార్యక్రమాల నిర్వహణ
. దిస్ ఈస్ నాట్ ఏ వన్ టైం రికార్డ్, ఇట్స్ యాన్ ఆల్ టైం రికార్డ్

తానా క్రీడలు అనగానే ఏముంది ఒక చెస్ లేదా వాలీబాల్ లేదా టెన్నిస్ లాంటి రొటీన్ ఆటలతో సాదాసీదాగా ఉంటాయి అనేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు కొత్తదనాన్ని ఒడిసిపట్టి, నెక్స్ట్ జనరేషన్ యువతని తానా వైపు తిప్పి, వారిని తానా క్రీడల్లో భాగస్వాములను చేస్తూ సృజనాత్మక ఆలోచనలతో తానా క్రీడల స్థాయిని పతాక స్థాయికి తీసుకెళ్లారు అంటున్నారు అమెరికాలోని తెలుగువారు. దీనికి కర్త కర్మ క్రియ తానా క్రీడా కార్యదర్శి, యువ సామ్రాట్ శశాంక్ యార్లగడ్డ.

వివరాలలోకి వెళితే… సుమారు 20 నెలల క్రితం తానా ఎన్నికలలో తనదైన స్టైల్ లో అటు తెలుగు ఇటు ఇంగ్లీష్ లో సింగిల్ పాయింట్ ఎజెండా నాది, నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ని తానా వైపు తిప్పుతానంటూ #TANANexGen హ్యాష్ టాగ్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకొని, ఎన్నికైన అనంతరం అన్నట్టే గత 16 నెలలుగా పక్కా యాక్షన్ ప్లాన్ తో పాత కొత్త తరాలను సమన్వయం చేసుకుంటూ అద్వితీయంగా ముందుకు సాగుతున్నారు శశాంక్.

ఇప్పటికే సుమారు 30 కి పైగా క్రీడా కార్యక్రమాలను అప్రతిహాతంగా నిర్వహించడమే కాకుండా మరి కొన్ని పైప్ లైన్లో పెట్టారు. తానా చరిత్రలో మొట్టమొదటిసారిగా త్రీ ఆన్ త్రీ బాస్కెట్ బాల్ టోర్నమెంట్, అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ టోర్నమెంట్, జాతీయ క్రికెట్ టోర్నమెంట్, జాతీయ ఉమెన్స్ త్రోబాల్ ఛాంపియన్షిప్, వికలాంగుల వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్ ఇలా చెప్పుకుంటూ పొతే దిస్ ఈస్ నాట్ ఏ వన్ టైం రికార్డ్, ఇట్స్ యాన్ ఆల్ టైం రికార్డ్ అని ప్రిన్స్ మహేష్ బాబు చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది. ఫస్ట్ టైం కొత్తగా నిర్వహించిన క్రీడల లిస్టే అంత పెద్దదిలా ఉంది మరి!

బీ ఎ రోమన్ ఇన్ రోమ్ అన్నట్లు ప్రతి తానా రీజియన్ లో ఎదో ఒక క్రీడా కార్యక్రమం నిర్వహించడం, దానికోసమని ప్రయాణం చేసి అక్కడికి వెళ్లి నెక్స్ట్ జనరేషన్ యువతతో కూడా మాట కలపడంతో పర్సనల్ టచ్ పెరిగింది. దీంతో తను మొదలుపెట్టిన #TANANexGen హ్యాష్ టాగ్ ట్రెండ్ అయ్యింది. అలాగే ప్రస్తుత మరియు పాత జనరేషన్ తో కూడా అన్న, అంకుల్ అంటూ కలుపుకుపోవడంతో అందరికీ తలలో నాలుకలా ఉన్నారు శశాంక్.

ఇందుగలడందులేడని ఎందెందు వెదకినా అందందే గలడు అని ప్రహ్లాదుడు చెప్పినట్లు పలు క్రీడా కార్యక్రమాలకు ప్రణాళిక రచించడం, నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తూ సమావేశాలు నిర్వహించడం, చాకచక్యంగా అందరిని కలుపుకొనిపోయి చిన్నది పెద్దది అంటూ తేడా లేకుండా ప్రతి క్రీడా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో తానా క్రీడలను కొత్త పుంతలు తొక్కించినట్లైంది.

స్వతహాగా ఫుట్బాల్ క్రీడాకారుడైన ఈ యువతేజం కొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ముందుకు వస్తుండడంతో శశాంక్ ఈస్ లీడింగ్ బై ఎగ్జామ్పుల్ అని అర్ధం అవుతుంది. కొత్తదనం ఉట్టిపడేలా కొత్త తరహా క్రీడలను సరికొత్త పోకడలతో నిర్వహించడంలో ఘనాపాటి గా పేరుతెచ్చుకున్నారు శశాంక్. దీంతో తానా క్రీడల్లో నూతన ఒరవడి సృష్టించినట్లైంది.

అతడే ఒక సైన్యం మాదిరి లార్జర్ దాన్ లైఫ్ తరహాలో ఎన్నో కొత్త క్రీడా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ తానా మూలవిరాట్ ముందు ముందు రాబోయే తానా క్రీడా కార్యదర్సులందరికీ ఆదర్శప్రాయంగా ఉండడమే కాకుండా యూ ఆర్ సెటింగ్ ది బార్ హై అంటున్నారు తానా (TANA) సభ్యులు.

ఎక్కువమందికి మక్కువైన క్రికెట్ క్రీడ ని ఎంచుకొని వికలాంగులలో మనోస్థైర్యాన్ని పెంపొందించేలా మీకోసం తానా ఉందంటూ దక్షిణ భారత దేశ దివ్యాంగుల వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్ తో తానా క్రీడల ఫీవర్ ని ఇండియాకి కూడా తీసుకెళుతుండడంతో 45 సంవత్సరాల తానా క్రీడల గతిని మార్చిన ‘ది అన్ స్టాపబుల్ నెక్స్ట్ జనరేషన్ శశాంక్ యార్లగడ్డ’ అంటూ ఇటు అమెరికా అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ అభినందిస్తున్నారు.

ఈ మొత్తం జర్నీలో శశాంక్ కి చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు సారధ్యంలోని కార్యవర్గ సభ్యులను, వెంకట రమణ యార్లగడ్డ సారధ్యంలోని ఫౌండేషన్ ట్రస్టీస్ ని, హనుమయ్య బండ్ల సారధ్యంలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని, అలాగే ప్రాంతీయ సమన్వయకర్తలను, సిటీ కోఆర్డినేటర్లను, అడ్-హాక్ కమిటీల సభ్యులను అందరినీ పేరు పేరునా అభినందించాల్సిందే.

నెక్స్ట్ జనరేషన్ యువతకి ప్రాతినిధ్యం వహిస్తూ మొదటిసారిగా తానా కార్యవర్గంలో అడుగుపెట్టి, అసమాన దూరదృష్టితో బుల్డోజర్ లా విజయవంతంగా దూసుకెళుతున్న కార్యదక్షుడు శశాంక్ ని స్ఫూర్తిగా తీసుకొని మరెందరో నెక్స్ట్ జనరేషన్ యువత తానా కార్యక్రమాల్లో పాల్గొంటూ తానా నాయకులుగా సేవలను మరింత విస్తృతం చేస్తారని ఆశిద్దాం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected