Connect with us

Government

న్యూజెర్సీ ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్న ఉపేంద్ర చివుకుల

Published

on

అమెరికాలో తెలుగువాడైన ఉపేంద్ర చివుకుల కు మరో అరుదైన గౌరవం లభించింది. న్యూజెర్సీలో గత కొన్నేళ్లుగా ఉపేంద్ర చివుకుల చేస్తున్న సేవలను గుర్తించిన న్యూజెర్సీ పరిపాలన విభాగం ఆయన సేవలను ప్రశంసింస్తూ ఓ ప్రకటన జారీ చేసింది.

న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ బోర్డు (New Jersey Board of Public Utilities) సమావేశంలో కమీషనర్లు ఫియోర్డలిసో, హోల్డెన్, సోలమన్, గోర్డాన్, క్రిసోడౌలాలు ఉపేంద్ర చివుకుల సేవలను గుర్తించి చేసిన తీర్మాన ప్రకటనను ఉపేంద్ర చివుకుల (Upendra J. Chivukula) కు అందించారు.

పన్ను చెల్లింపుదారులు, రేట్ పేయర్స్ కోసం గత 25 సంవత్సరాలుగా ఉపేంద్ర చివుకుల చేసిన సేవలు మరువలేనివిగా వారు అభివర్ణించారు. చిత్తశుద్ధితో, సేవా దృక్పథంతో పనిచేసిన ఉపేంద్ర చివుకులకు కృతజ్ఞతలు తెలుపుతూ గవర్నర్ ఫిల్ మర్ఫీ కూడా ఓ ప్రశంశా ప్రకటనను అందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected