Connect with us

Bathukamma

Update: అక్టోబర్ 2 ఆదివారం ఆల్ఫారెటా దేశాన పాఠశాలలో గేట్స్ బతుకమ్మ, దసరా సంబరాలు

Published

on

*** VENUE & DATE CHANGE ***

హరికేన్ ఇయాన్ వాతావరణ పరిస్థితుల వల్ల గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ బతుకమ్మ, దసరా సంబరాలను అక్టోబర్ 2 ఆదివారానికి మార్చారు. వెన్యూ కూడా అందరికీ దగ్గిరగా ఆల్ఫారెటాలో ఇండోర్ వేదిక అయినటువంటి దేశాన పాఠశాలకు మార్చారు. కేవలం ఒక రోజు తేదీ మరియు వెన్యూ మాత్రమే మారింది. కానీ ముందస్తు ప్రణాళిక ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుండి అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున యధావిధిగా నిర్వహిస్తున్నారు. ఇంకా ప్రత్యేకంగా ప్రముఖ జానపద గాయని మల్లిక స్వరం ఆహ్వానితులను అలరించనున్నారు.

సాఫ్ట్ పాత్ సిస్టం మరియు రెడ్డి సీపీఏ టైటిల్ స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్న ఈ గేట్స్ బతుకమ్మ, దసరా సంబరాలలో గ్రూప్, సింగిల్ మరియు టీన్ కేటగిరీస్ బతుకమ్మ పోటీలలో డైమండ్ రింగ్ మరియు కాష్ ప్రైజెస్ వంటి బంపర్ ప్రైజస్ ఇవ్వనున్నారు.

బతుకమ్మ రెజిస్ట్రేషన్స్ కు https://tinyurl.com/gatesbathukamma, వెండర్ స్టాల్స్ కు https://www.gatesusa.org/donations/vendor-registration-form, ఈవెంట్ రెజిస్టర్ చేసుకోవడానికి ని http://evite.me/pmKemCjgy4 సందర్శించండి. మరిన్ని వివరాలకు ఫ్లయర్ ని చూడండి.

గౌరీ పూజ, జానపద పాటలు, నృత్యాలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగ భోజనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కావున బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆ మహాతల్లిని భక్తి శ్రద్ధలతో సేవిద్దాం రండి అంటున్నారు సునీల్ గోటూర్ ఆధ్వర్యంలోని గేట్స్ 2022 కార్యవర్గం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected