Connect with us

Dasara

సెప్టెంబర్ 25న తామా దసరా బతుకమ్మ వేడుకలు & మహిళా సంబరాలు

Published

on

అట్లాంటా తెలుగు సంఘం (Telugu Association of Metro Atlanta) ‘తామా’ వారు సెప్టెంబర్ 25 ఆదివారం రోజున దసరా, బతుకమ్మ వేడుకలు మరియు మహిళా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఆల్ఫారెటా లోని స్థానిక దేశానా మిడిల్ స్కూల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఘనంగా నిర్వహించనున్న ఈ సంబరాలకు ప్రవేశం ఉచితం. అలాగే పండుగ ప్రత్యేక భోజనం కాంప్లిమెంటరీ.

ప్రముఖ యాంకర్ సాహిత్య వింజమూరి (Sahitya Vinjamuri) చమత్కారమైన తన మాటలతో అందరినీ అలరించడానికి సిద్ధమవుతున్నారు. బతుకమ్మ ఆటపాట, కోలాటం, బతుకమ్మ నిమజ్జనం, షాపింగ్ స్టాల్ల్స్, టాలీవుడ్ లేటెస్ట్ హిట్ సినిమా ‘సీతారామం’ థీమ్ ఫాషన్ షో, తామా మహారాణి బ్యూటీ పేజెంట్, మాస్టర్ చెఫ్, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి.

ఎస్ ఎల్ ఆర్ మోర్ట్గేజ్ మరియు పెర్సిస్ బిర్యాని ఇండియన్ గ్రిల్ రెస్టారెంట్ వారు ఈ తామా (TAMA) దసరా బతుకమ్మ వేడుకలు & మహిళా సంబరాలకు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. రెజిస్ట్రేషన్స్ కొరకు www.tama.org/bathukammamahila ని సందర్శించండి. అలాగే మరిన్ని వివరాలకు పైనున్న ఫ్లయర్ ని చూడండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected