Connect with us

Cultural

గీతామాధురి సంగీత విభావరి, NTR నట ప్రస్థానం, RNR లైవ్ బ్యాండ్, నాలెడ్జ్ బౌల్ పోటీలు @ TAMA Sankranthi on Jan 21st

Published

on

అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సంక్రాంతి సంబరాలు వచ్చే శనివారం జనవరి 21న నిర్వహిస్తున్నారు. సాయిరాం కారుమంచి కార్యవర్గ అధ్యక్షునిగా, సుబ్బారావు మద్దాళి బోర్డ్ ఛైర్మన్ గా జనవరి 1 నుంచి 2023 సంవత్సరానికి గాను బాధ్యతలు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

వీరి సారధ్యంలో మొట్టమొదటి సాంస్కృతిక కార్యక్రమం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడానికి ప్రణాళిక తయారుచేశారు. అందరికీ అనువుగా కమ్మింగ్ నగరంలోని స్థానిక డెన్మార్క్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వీనుల విందు చేసేలా సన్నద్ధమవుతున్నారు.

ప్రముఖ టాలీవుడ్ గాయని గీతామాధురి (Geetha Madhuri) మరోసారి ఈ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఈవెంట్లో సంగీత విభావరితో అలరించనున్నారు. RNR వారి లైవ్ బ్యాండ్ ప్రత్యేకం. మన టీవీ & టీవీ 5 యాంకర్ లావణ్య మరియు కొంతమంది యువత తమ వ్యాఖ్యానంతో ఆకట్టుకోనున్నారు.

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ నట ప్రస్థానంపై నట నాట్య పద ప్రదర్శన అంటూ తామా వారి నివాళి హైలైట్ అవ్వనుంది. ముగ్గుల పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రాండ్ ర్యాఫుల్ బహుమతులు, షాపింగ్ స్టాల్స్, రుచికరమైన తెలుగింటి భోజనం వంటివి అదనం.

ఇక పొతే మ్యాథ్, సైన్స్, ఇంగ్లీష్ పరిజ్ఞానానికి సంబంధించి విద్యార్థులకు నాలెడ్జ్ బౌల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సంక్రాంతి సంబరాలకు హాజరవ్వాలంటే www.tama.org/sankranthi లో టికెట్స్ కొనుక్కోండి. జనవరి 15 లోపు కొంటే ప్రత్యేక డిస్కౌంట్ లభించును.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected